Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులను ప్రారంభించనున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
- ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
- ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభించనున్న ఫాక్స్ కాన్
- సుమారుగా 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమ ఫాక్స్ కాన్ రంగారెడ్డి జిల్లా కొంగలకలాన్లో ఏర్పాటు చేయనున్న ఫాక్స్ కాన్ పరిశ్రమ ఏర్పాటుకు నేడు భూమిపూజ నిర్వహించనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు ఐటి శాఖ మంత్రి వర్యులు కేటీఆర్, జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ పరిశ్రమ ఏర్పాటుకు అంకురార్పన చేయనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. భూమిపూజ అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమ ఏర్పాట్లను అధికారులు, ఫాక్స్ కాన్ ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలిం చారు. తెలంగాణ ఐటి ఈసీ డైరెక్టర్ సుజరు, టీఎస్ఐఐసీసీ సీఈవో మధుసూధన్, ఫాక్స్ కాన్ తెలంగాణ మేనేజర్ బ్రయన్ కోర్, డీసీపీ శ్రీనివాస్‌లతో కార్యక్రమ ఏర్పాట్లపై ఎమ్మెల్యే వివరించారు. ఉదయం 10 గంటలకు పరిశ్రమ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఫాక్స్ కాన్ పరిశ్రమ ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభించనుంద ని ఈ ప్రాంత యువతకు 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పరిశ్రమల ప్రతినిధులు చెప్పారు. మహిళలకు, యువతకు, నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో అవకాశాలు కల్పిస్తామని, జిల్లా యువతకు, మహిళలకే ప్రాధాన్యత నివ్వనున్నట్లు చెప్పారు. కార్యక్ర మంలో రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమ ణారెడ్డి, ఏసిపీ ఉమామహేశ్వర రావు, జోనల్ మేనేజర్ రవి, సీఐలు రవికుమార్, కాశీనాథ్, భాస్కర్, ఫాక్స్ కాన్ ప్రతినిధి శర్మ, తదితరులు పాల్గొన్నారు.