Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.11 లక్షల 2 వందల నకిలీ నోట్ల స్వాధీనం
- నిందితుల అరెస్టు, రిమాండ్
- వివరాలు వెల్లడించిన శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డి
నవతెలంగాణ-శంషాబాద్
నకిలీ నోట్లను తయారు చేసి భారతీయ ఒరిజినల్ నోట్లతో కలిపి మార్కెట్లో చలామణి చేస్తున్న ఇద్దరు నిందితుల అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివ రాలను శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ నారాయణరెడ్డి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో వెల్లడించారు. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ)కి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్‌లోని హౌటల్లో నిందితులను పట్టుకున్నారు. వీరిలో ఆంధ్రప్రదే శ్ అనకాపల్లి నర్సీపట్నం చెందిన తోమండ్ర రంజిత్ సింగ్ సివిల్ కన్స్ట్రక్షన్లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అనకాపల్లి కొవ్వూరు గ్రామానికి చెందిన మాసండ్ల మోహన్‌రావు కలిసి ఇద్దరూ ఒక ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ నోట్లను తయారు చేయడానికి శంషాబాద్‌లో హౌ టల్‌ను అడ్డాగా చేసుకున్నారు. నకిలీ కరెన్సీనీ చలామణి చేసేందుకు ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి వారు కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమ ఏజెంట్లను నియమించారు. 1.3 నిష్పత్తిలో నకిలీ కరెన్సీ నిర్వహణ చేస్తున్నారు. వీరు ప్రధానంగా కూరగా యల మార్కెట్లు, పార్కింగ్ స్థలాలు, పండ్ల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, రైతు బజార్ల వద్ద రాత్రిపూట తిరు గుతూ నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నారు. అసలైన భారతీయ కరెన్సీ నోట్లతో నకిలీ నోట్లు కలిపి చ లామణి చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బు లు సంపాదిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు శంషాబాద్‌లోని హౌటల్‌పై దాడి చేశారు. అక్కడ తయారు చేసిన రూ.8.55 లక్షల నకిలీ నోట్లను, రూ.2. 45 లక్షల విలువైన నోట్లు తయారు చేయడానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ముద్రణకు ఉప యోగించిన పరికరాలు, తయారు చేసిన నకిలీ నోట్లు కలి పి రూ.11 లక్షలు 200 పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. వీరిద్దరిపై ఇప్పటికే పలు నేరాల కింద వివిధ పోలీస్ స్టేష న్లలో కేసులు నమోదయ్యాయి. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ ఎం.ఏ. రషీద్, అడిషనల్ డీసీపీ పి.నారాయణ, శంషాబాద్ ఆర్జీఐ ఏపీ ఎస్ ఏసీపీ వి.భాస్కర్, సీఐ ఆర్.శ్రీనివాస్, శంషాబాద్ పీఎస్ సీఐ శ్రీధర్ కుమార్, ఎస్ఓటీ ఇన్స్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.