Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ కవి దోరవేటి చెన్నయ్య
- అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఏర్పాటు
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
మన సాహిత్య, సంస్కృతులను కలాలతో కూడగట్టి విశ్వవ్యాప్తంగా చాటి చెబుతామని ప్రముఖ కవి, అనంత వేదిక రూపకర్త దోరవేటి చెన్నయ్య అన్నారు. శనివారం వికారాబాద్ సమీపంలోని బుగ్గరామలింగేశ్వర ఆలయం వద్ద శ్రీ కృష్ణారాధన పుస్తకావిష్కరణ, జిల్లా కవుల నూతన కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కవులకు, రచయితలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, చరిత్రకెక్కిన మV కవులు కూడ వున్నారని అ న్నారు. అలాంటి తెలంగాణ ప్రాంతంలోని వికారాబాద్ జి ల్లాకు సాహిత్య చరిత్ర, సంస్కృతీ, సాంప్రదాయాల్లో ప్ర త్యేక స్థానం ఉందన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు డా.తూర్పు మల్లారెడ్డి మాట్లాడుతూ.. తమ రచనలతో నూతన ఒరవడిని సృష్టించి ప్రజా శ్రేయస్సుకు కవులు శ్రమించాలని కోరారు. అనంతరం మల్కానెల్లి లాల్ రెడ్డి రాసిన ఘనంగా శ్రీ కృష్ణారాధన పుస్తక ఆవిష్కరించి, నూతన కమిటీ ఏర్పాటు చేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు తూర్పు మల్లారెడ్డి, గౌరవ అధ్యక్షులు నర్సిహులు గుప్తా, అధ్యక్షుడిగా వడిచర్ల సత్యం, ప్రధాన కార్యదర్శిగా ఆశీర్వా దం, కోశాధికారిగా మున్నూరు రాజు, సహాయ కార్యదర్శిగా సుధాకర్‌గౌడ్, సాంస్కృతిక కార్యదర్శిగా మల్కానెల్లి లాల్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా రేగడి మైల్వర్ అంజిలప్ప, మహి ళా కార్యదర్శిగా అనురాధ సురేష్, కార్యాలయ నిర్వాహ కులు దివాకర్ శాస్త్రీ, కార్యవర్గ సభ్యులుగా నర్సిహులు, వెంకటేష్ ముదిరాజ్, శ్రీనివాస్ ఎన్నారం, కమలేష్, రామ చంద్రుడు, ప్రసాద్, రెడ్యా రాథోడ్, కరణం మనిక్రావు, మాసాని వెంకటయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.