Authorization
Tue March 25, 2025 07:41:44 am
నవతెలంగాణ-ఆమనగల్
లయన్స్ క్లబ్ ఆమనగల్ అధ్యక్షులుగా 2023-2024 సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ సభ్యులు సుద్ధపల్లి సర్పంచ్ యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని లయన్స్ భవన్ లో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ జి.చెన్న కిషన్ రెడ్డి, ఫాస్ట్ మల్టిపుల్ చైర్మెన్ సందడి నరేందర్ రెడ్డి, మాజీ గవర్నర్ జే. రమేష్ బాబు, రామ్ రెడ్డి లయన్ ఐ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ వి. దామోదర్ రెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెంట్ల సమక్షంలో జరిగిన ఎన్నికల్లో క్లబ్ అధ్యక్షులుగా యాచారం వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శిగా కే.గోవర్ధన్ రెడ్డి, కోశాధికారిగా కొరివి వెంకటయ్య, క్లబ్ పిఆర్ఓగా ఏం.ఏ.పాషా, ఉపాధ్యక్షులుగా పసుల లక్ష్మారెడ్డి, గోవర్ధన్రెడ్డిలను ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సుద్ధపల్లి వెంకటేశ్వర్లుగౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎన్నికకు సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులకు కతజ్ఞతలు తెలిపారు. క్లబ్ సభ్యుల సహకారంతో లయన్స్ సేవలను మరింత విస్తృతపరుస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ భావాండ్ల వెంకటేష్, జోన్ చైర్మెన్ కె.రామ్ రెడ్డి, క్లబ్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కోశాధికారి కర్నాటి కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.