Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ పంచాయతీ కార్యదర్శుల గైర్హాజర్ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి
- వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
విధులకు హాజరు కాని పంచాయతీ సెక్రెటరీల స్థానంలో ప్రత్యామ్నాయంగా కొత్త వారిని నియమించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అన ధికార గైర్హాజరు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు అనధికార గైర్హాజరు నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12.00 గంటల లోగా విధులకు హాజరుకావాలని, హాజరైన వారిని మినహాయించి, హాజరుకాని సెక్రెటరీల జాబితా సిద్ధం చేసి వారి స్థానంలో తాత్కాలిక నియామకాలు ఆదివారం సా యంత్రం వరకు చేపట్టాలని ఆదేశించారు. ఏ గ్రామంలో నైతే సెక్రెటరీలు విధులకు హాజరు కాలేరో సదరు సెక్రటరీల స్థానంలో అదే గ్రామానికి చెంది డిగ్రీ పూర్తి చే సి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారిని కొత్త సెక్రెట రీలుగా తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని కలెక్టర్ సూచించారు. గతంలో నిర్వహించిన రిక్రూట్మెంట్ ఆధా రంగా వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి ప్రాధాన్యతను ఇచ్చి ఎంపిక చేయాలని సూచించారు. అన్ని మండలాలలో ఎంపీడీవోలు, తహసీిల్దారులు, మండల సూపర్వైజర్లు, ఎంపీఓలు, ఏపీఎంలు సంబంధిత గ్రామ సర్పంచులు, ఉ ప సర్పంచ్‌లతో సంప్రదించి హాజరు కాని గ్రామ కార్యద ర్శుల స్థానంలో ఆదివారం గ్రామ సభలు నిర్వహించి డిగ్రీ విద్యతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం గల అదే గ్రామానికి చెందిన అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ చేపట్టాలన్నారు. గ్రా మ సభలు నిర్వహించి తీర్మానం ప్రకారం ఎస్సీ స్థానంలో ఎస్సీలకు, ఎస్టీ బీసీ స్థానాల్లో అట్టి వారిని నియామకం చేయాలని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్, తాండూర్ ఆర్డీవోలు విజయకుమారి, అశోక్‌కుమార్, జిల్లా అధికారులతో పాటు ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.