Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి
- పగిడియాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-యాలాల
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తాండూరు యువ శాసనసభ్యు లు పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. మండలంలోని పగిడియాల గ్రామంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పా ల్గొని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగో లు కేంద్రాలను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్తు, పె ట్టుబడి సాయం, అందజేయడంతో అధిక ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందని తెలియ జేశారు. పంట సాగకు రైతులను ఆదుకోవడంతోపాటు పండించిన ధాన్యానికి మ ద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంద న్నారు. వరి ధాన్యం మొదటి రకం క్వింటాలకు రూ.2060, కాగా, రెండో రకం వరి ధాన్యం క్వింటాలకు రూ.2040 మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. రైతుల సౌకర్యం కోసం కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు రైతులకు కావాల్సిన సౌకర్యాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఆ దిశగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాళ్లపల్లి బాలేశ్వర్ గుప్తా, స్థానిక సర్పంచ్ బసిరెడ్డి, రాష్ట్ర ఎంపీటీసీ సభ్యుల సంఘం ఉపాధ్యక్షుడు హెచ్ రాములు, పీఏసీఎస్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సప్తగిరిగౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.