Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.కృష్ణయ్య
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కచ్ఛితంగా న్యాయం చేస్తారని బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టైగర్.బి. కృష్ణయ్య హమీనిచ్చారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జూ నియర్ పంచాయితీ కార్యదర్శులు చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని వారికి సంఘీభా వం తెలియజేశారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడు తూ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వివిధ రాజకీయ పార్టీల ఊబిలో పడొద్దని హితవు పలికారు. జూనియర్ కార్యదర్శుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. యూనియన్ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రతినిధు లు మాట్లాడే విధంగా రాష్ట్ర ప్రతినిధి బృందం సీరియస్ గా ప్రయత్నం చేస్తోందని గుర్తు చేశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలు అందరూ తెలంగాణ బిడ్డలని, వారిని సీఎం కేసీఆర్ పోగొట్టుకోడని తెలిపారు. రెచ్చగొట్టే సంఘాలకు, రాజకీయ పార్టీలకు కార్యదర్శులు దూరంగా ఉండాలని సూచించారు. జూనియర్ పంచాయితీ కార్యద ర్శులు అనవసరంగా ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ఆయన కోరారు. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.