Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ ముదిరాజ్
- షాద్‌నగర్‌లో పండుగల సాయన్న విగ్రహా ఆవిష్కరణ
- పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్
నవతెలంగాణ-షాద్‌నగర్
మన చరిత్ర భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉండాలని, మన చరిత్రను లిఖించేవారు ఎవరో రారని ఎవరికోసమో ఎదురు చూడొద్దని మన చరిత్రను మనమే స్వయంగా రా సుకొని చరిత్రలో నిలబడాలని శాసనమండలి డిప్యూటీ చైర్మె న్ బండ ప్రకాష్ ముదిరాజ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో పండుగల సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బండ ప్రకాష్‌తో పాటుగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, ఈటల రాజేందర్, బితిరి సత్తి తదితరులు హాజరై మాట్లాడారు.ఈ సందర్బంగా వారూ మాట్లాడుతూ పండుగ సాయన్న పేదప్రజలకు దానధర్మాలు చేసిన ప్రజా నాయకుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా సుపరిచితుడని, ప్రజలను దోసుకుంటున్న దొరల, దేశముక్ల, అధికారుల, సంపన్నుల ఆస్తులను తీసుకొని, ఇవ్వకపోతే దోచుకుని పేదలకు పంచినట్టుగా మాత్రమే దూర ప్రాంతాల వాళ్ళు అనుకుంటారని, కానీ రాబిన్‌హుడ్ లాగా పండుగల సాయన్న కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టే పని పెటు ్టకోలేదని, పండుగల సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారాలను, అధికారులను ప్రశ్నించి, వారిని ఎదిరించి, తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకొని, ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడని గుర్తు చేశారు. డాక్టర్ కిన్నెర మొగలయ్య ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉండేవారని అతని ప్రతి భను ముదిరాజ్ మొదట గుర్తించి వెలుగులోకి తేవడం జరి గిందని అన్నారు. కళాకారుడిగా కిన్నెర తత్వాన్ని జాతికి తెలి యజేస్తూ నేడు ప్రభుత్వ సహకారంతో డాక్టర్ పద్మశ్రీ బిరు దులు పొందారని అన్నారు. మన చరిత్ర భవిష్యత్తు తరాల కు దిక్సూచిగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాలు వెల్లు వెత్తుతున్నాయని గుర్తు చేశారు. ఈటెల రాజేందర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నో ప్రాంతాల్లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాలు నిర్మించబడ్డా యని తాజాగా కూడా అనేక ప్రాంతాల్లో ముదిరాజ్ భవ న నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కేంద్రంలో రెండు కోట్ల రూపాయలతో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని అన్నారు. అదేవిధంగా వన పర్తి అచ్చంపేట, గద్వాల, సిద్దిపేట, మెదక్, జగిత్యాల, జహీరాబాద్ తో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కొమరవెల్లి, వేములవాడలో కూడా ముదిరాజ్ భవనాలు ఏర్పాటు చేయ బోతున్నామని అన్నారు. అందరం సంఘటితంగా పనిచేస్తే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో కూడా ముదిరాజ్ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ముది రాజ్ భవనం ఉండేటట్టు చర్యలు తీసుకుంటామని అన్నా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన సకుటుంబ సర్వే ముదిరాజ్ జాతికి ఎంతో ఉపయోగపడిందని ఈ సందర్భం గా గుర్తు చేసుకున్నారు. ఈ సర్వే వల్లనే రాష్ట్రంలో అన్ని కులాల కంటే ఎక్కువ ముదిరాజ్ సంఖ్య ఎక్కువగా ఉందని తేలిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సకుటుంబ సర్వే జాతికి ఎంతో మేలు చేసిందని బండ ప్రకాష్ అన్నారు. భిన్న మైన జీవితాన్ని గడుపుతున్న ముదిరాజులు అనేక ప్రాం తాల్లో అనేక వృత్తులు చేయాల్సి వస్తుందని కొన్ని ప్రాంతాల్లో కులవృత్తి కాకుండా గీత కార్మిక పని కూడా చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాంటి వారిని గుర్తించి సహ కార సంఘాల్లో పరపతి కల్పించి ఆదుకుంటున్నామని అన్నా రు. షాద్‌నగర్‌లో ఎకరా స్థలం ఇస్తే ఇక్కడ కూడా ముది రాజ్ భవనం పెద్ద ఎత్తున నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో 88 మత్స్య సహకార సం ఘాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్య క్రమంలో వివిధ పార్టీల నాయకులూ, ముదిరాజులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.