Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ పటేల్ విజయ్ కుమార్ యాదవ్, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్
నవతెలంగాణ-కొడంగల్
యాదవ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన రేవం త్ రెడ్డి యాదవ కులానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంపీపీ పటేల్ విజయ్ కుమార్ యాదవ్, కౌన్సిలర్ మధు సూదన్ యాదవ్‌లు డిమాండ్ చేశారు. కొడంగల్‌లోని అతిథి గృహంలో నియోజకవర్గంలోని యాదవులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పా లని డిమాండ్ చేశారు. గొల్ల, కురుమ జాతులను రేవంత్ రెడ్డి అవమానపరిచారని ధ్వజమెత్తారు. గొల్ల, కురుమ జా తులు నీతి, నిజాయతీగా బతుకుతాయని, అందరి తలలో నాలుకలా ఉండే జాతులని అన్నారు. రేవంత్ రెడ్డి కుల దురహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. బడుగు, బల హీన వర్గాలకు కెేసీఆర్ చేయూతను అందిస్తే, రేవంత్ రెడ్డి వారిని కించపరుస్తున్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో గొల్ల, కురుమలు కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డిని ఓడిస్తారన్నా రు. ఒక ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడు స్థాయిలో ఉన్న ఆయన యాదవ మంత్రిని కుల దురహంకారంతో దూషించడం తగదన్నారు. తాము ప్రపంచానికి అన్నం పె ట్టే యాదవులమని, పాలు, పెరుగు, వెన్నె, నెయ్యి, మాం సం, ఉత్పత్తి చేసే వృత్తి అని ఈ సమాజానికి పౌష్టికా హారాన్ని అందించే ఉత్పత్తిదారులమన్నారు. రాజకీయ చరిత్ర తెలియని రేవంత్ రెడ్డి ఆర్థిక, కులహంకారంతో యాదవ మంత్రిని నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికా దన్నారు. రేవంత్ రెడ్డి యాదవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్య క్రమంలో కృష్ణ యాదవ్, జగన్, కొండేటి వెంకటప్ప, శీను, బండి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.