Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
- అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తాం
- రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ
- నిరుద్యోగులకు రూ.4వేల నిరుద్యోగ భృతి
- రేషన్‌తోపాటు 9రకాల నిత్యావసర సరుకులు అందజేస్తాం
- కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య అందిస్తాం
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
- కొందుర్గు, పరిగి మండలాల్లో కొనసాగిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్ర
నవతెలంగాణ-పరిగి
కాంగ్రెస్‌తోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుంద ని, అలాగే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భట్టి చేప ట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివా రం కొందుర్గు మండలంలో పాదయాత్ర కొనసాగింది. రా త్రికి పరిగికి చేరుకుంది. పరిగి మండలానికి భట్టి పాద యాత్ర చేసుకున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, వికారా బాద్ డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి భట్టికి ఘన స్వాగతం పలికారు. తొండపల్లిలో క్యాడర్‌తో కలిసి గజమాలలు, హారతులతో భట్టికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో భట్టి విక్రమార్క మాట్లాడారు.. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పక్కాగా అధికారంలోకి వస్తుందన్నారు. ప్రజలకు దొంగ హామీలు ఇచ్చిన మోసం చేసిన సీఎం కేసీఆర్‌ను ఇంటికి సాగనంపుతారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. రైతులను అన్నివిధాలా ఆదుకుం టామన్నారు. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. సబ్సిడీ యంత్రాలు అందజేస్తామన్నారు. పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశాడన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రెండు లక్షలు ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు భృతి ఇస్తానని చెప్పి మోసం చేశాడని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.4వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదేండ్ల కాలం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పేదలకు మూడెకరాల భూ మి, ఇండ్ల స్థలాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నిరుద్యోగుల కు ఉద్యోగలు వంటి ఏ ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ఉచిత నిర్భంద విద్య అందిస్తామన్నారు. పేదలకు భూ పంపిణీ చేస్తామన్నారు. స్థలం ఉన్న వారికి ఇండ్లు కట్టుకో వడానికి రూ.ఐదు లక్షలు ఇస్తామన్నారు. ప్రస్తుతం రేషన్ షాప్‌ల్లో కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని, తాము బియ్యంతోపాటు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులలను పంపిణీ చేస్తామని తెలిపారు. నేటికీ పాలమూరు ఎత్తిపో తల పూర్తి కాలేదని, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌కు భూసేకర ణ కూడా జరగలేదని అన్నారు. ఈసారి బీఆర్ఎస్ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి కృష్ణ నీళ్లుతీసుకువచ్చి ఇక్కడ రైతుల పాదాలు కడుగుతామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో షాద్‌నగర్, పరిగిలో తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రామ్మోహ న్‌రెడ్డి, నాయకులు లాలు కృష్ణ, విజయ్, నరేందర్ రెడ్డి, శంకర్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.