Authorization
Tue March 18, 2025 08:35:30 pm
నవతెలంగాణ-తాండూర్ రూరల్
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను కరణ్ కోట్ పోలీసులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండలం బెల్కటూర్ గ్రామానికి చెందిన బసంత్ అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్ తాండూరు కాగ్నా నది నుంచి ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారిం చగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. ఓనర్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండు సార్లు కంటే ఎక్కువగా పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు.