Authorization
Thu March 20, 2025 02:41:21 pm
నవతెలంగాణ-మంచాల
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, యువతకు అండగా ఉంటానని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచి రెడ్డి ప్రశాత్రెడ్డి అన్నారు. మంగళవారం బంటి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పాటల ఆడియోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా పాటల ఆడియోను పాడించిన బంటి యూత్ ఫోర్స్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీనిచ్చారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా యువత అనేక సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం ద్వారా వచ్చే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమూలో బంటి యూత్ ఫోర్స్ సభ్యులు వనపర్తి బద్రినాథ్ గుప్తా, ఎండీ జానీ పాషా, ఆవుల ప్రశాంత్ యాదవ్, నిఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.