Authorization
Fri March 21, 2025 05:35:30 am
- ఎంపీపీ మంద జ్యోతి పాండు, జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
ప్రతి ఒక్కరూ తప్పనసరిగా మాస్కులు ధరించాలని, మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తప్పవని ఎంపీపీ మంద జ్యోతిపాండు, జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బందికి 'కొవిడ్-19'పై ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో దశ కరోనా విస్తరిస్తోందని ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. లేనియేడల నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, మహేశ్వరం మార్కెటింగ్ చైర్పర్సన్ వరలక్ష్మి సురేందర్ రెడ్డి, ఎంపీడీవో కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శు లు పాల్గొన్నారు.