Authorization
Sun March 16, 2025 01:23:35 pm
పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నపరిమళ్
నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి జయంత్యుత్సవాల్లో పాల్గొన్నారు. తాండూర్ పట్టణంలోని ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయంలో నిరుపేదల ఇబ్బందిని తొలగించేందుకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా కరోనా వైరస్‌తో చనిపోయిన మతదేహాలకు దహన సంస్కారాలు చేస్తున్న మహాసేన టీమ్ వారికిగా ఆర్థికసాయం అందించారు. తాండూరు పట్టణ కేంద్రంలో కొన్నిరోజులుగా కరోనాతో బాధపడుతున్నవారికి ఉచితంగా భోజనం అందిస్తున్న హెల్పింగ్హాండ్స్ గ్రూప్‌కు బియ్యం బస్తాలను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు భయపడొద్దని, తగిన జాగ్రతలు తీసుకుంటే సరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.