Authorization
Sun March 16, 2025 01:54:43 pm
ఇన్చార్జి ఎస్ఐగా వెంకట్‌నారాయణ బాధ్యతలు
నవతెలంగాణ - బొంరాస్‌పేట్
లాక్డౌన్ సమయంలో ఎవరైనా అనవసరంగా రోడ్లపై వస్తే వాహనాలు సీజ్ చేస్తామని ఇన్చార్జి ఎస్ఐ జీ వెంకట్‌నారాయణ హెచ్చరించారు. ఎస్పీ నారాయణ ఆదేశానుసారం లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీలో భాగంగా గురువారం ఆయన బొంరాస్‌పేట్ ఇన్చార్జి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. గతంలో కోట్‌పల్లి పీఎస్ పరిధిలో విధులు నిర్వహించినట్లు చెప్పారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సడలింపు సమయం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరుకులను తెచ్చుకోవాలని, మిగతా సమయంలో రోడ్లపైకి రావద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సెక్షన్ 59, 61, ఐపీసీ 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హఫీజ్, ట్రైనింగ్ ఎస్ఐలు రాహుఫ్, అలంక్రిత్ గౌడ్, ఏఎస్ఐ సత్యశీలారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్ చారి, కానిస్టేబుల్స్ శ్రీనివాస్‌గౌడ్, శ్యామ్, శంకర్, ఆంజనేయులు, సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.