Authorization
Sun March 16, 2025 09:01:32 am
- కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్నగర్ రూరల్
ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ పిలుపు నిచ్చారు. శుక్రవారం దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ స్థలాన్ని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి తదితరుల తో కలిసి వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇంద్రవెల్లిలో ప్రకటించిన రెండవ సభ ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున జరగ బోతుందని, దళిత గిరిజన ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ ముందడుగు వేస్తుందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని అన్నారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తామని తెలిపారు. నియోజకవర్గం నుంచి ఇబ్రహీంపట్నం సభకు పెద్ద ఎత్తున సమాయత్తం అవుతున్నట్టు తెలిపారు.