Authorization
Sun March 16, 2025 09:21:23 am
ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం,రజక సంఘం పిలుపు
నవతెలంగాణ-మొయినాబాద్
ఈనెల 26వ తేదీన చేవెళ్లలో నిర్వహించ తలపెట్టిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు, విగ్రహా ఆవిష్కరణ కా ర్యక్రమం విజయవంతం చేయాలని ఏఐఏవైస్ రాష్ట్ర సహా య కార్యదర్శి బేగరి రాజు, రజక సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు చాకలి మల్లేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మొయినాబాద్ మండల కేంద్రంలో కరపత్రాలు వి డుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కార్యక్ర మానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మె ల్యే యాదయ్య, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, బస్వరాజు సార య్య, జడ్పీ ఛైర్మన్ అనితరెడ్డి, ప్రజాకవి, గాయకులు జయ రాజ్, రజక సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ అంజయ్య, రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ రాజు కృష్ణమూర్తి, జేఏసీ చైర్మన్ ఆం జనేయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిధులుగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై. కృష్ణ, మొయినాబాద్ మండల ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, పెండ్యాల రఘు, కృష్ణ, దేవిని ఎర్రవల్లి పాండు, గుండాల శ్రీనివాస్, మల్కాపురం దీపక్ పాల్గొన్నారు.