Authorization
Tue March 18, 2025 02:32:09 am
ఇంటి యజమానికి తీవ్రగాయాలు
నవతెలంగాణ-కందుకూరు
అధిక వర్షాలతో సోమవారం రాత్రి ఇల్లు కూలిపోయి,ఆ ఇంటి యజమాని కాలికి తీవ్రగాయాలయ్యాయి. మండల పరిధిలోని మురళినగర్ గ్రామానికి చెందిన పోలేమోని శంకరయ్య, భార్య మంగమ్మ, కొడుకుతో రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎడతెరపు లేకుండా వర్షాలు రావడంతో రేకుల ఇల్లు బునాది మట్టం కూలీ, నేలమట్టమైంది.ఇంట్లో నిద్రిస్తున్న శంకరయ్య కాలుకు తీవ్రగాయాలు కాగా, భార్య, కొడుకు, స్వల్పగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న చెప్పలపల్లి ఎంపీటీసీ సూరమోని లలిత కుమార్, టీఆర్ఎస్ యువజన విభాగం మండల ఉపాధ్యక్షులు రామాంజనేయులు కూలిన ఇల్లు ను పరిశీలించారు. కాలికి తీవ్రగాయాలైన శంకరయ్యను ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స నమిత్తం సొంత డబ్బులు అందజేశారు.కాళ్ళకు తగిలిన గాయాలు మానే వరకు తమ సొంత డబ్బులు ఇస్తామని హామీనిచ్చారు.