Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయ జీవితంలో ఉచిత మెడికల్
క్యాంప్ తృప్తినిచ్చింది
'మన ఊరు మన ఆరోగ్యం' అనే కార్యక్రమం
ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ఉచిత వైద్య శిబిరాలు
చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్
మెతుకు ఆనంద్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సంతోషపడేది తానే అని, రాజకీయ జీవతంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం తృప్తినిచ్చిందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ధరూర్ మండలం పరిధిలోని మోమిన్‌కలాన్ గ్రామంలో ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ 'మన ఊరు ఊరు మన ఆరోగ్యం' అనే కార్యక్రమంతో ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొదటి ప్రాధాన్యతగా విద్య, వైద్యంపై దృష్టి సారించినట్టు తెలిపారు. తన రాజకీయ జీవిత అనుభవంలో ఉచిత వైద్య శిబిరాలు తృప్తి నిచ్చాయని తెలిపారు. 70ఏండ్లలో ఇప్పుడే విద్య, వైద్యంపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఇంతకు ముందు ఎవ్వరూ విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. విద్య కోసం 7 వేల కోట్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్దే అన్నారు. ప్రజలకు ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. ప్రజలకు అనారోగ్యమైన సందర్భం వస్తే వారికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉచిత వైద్య శిబిరాలు పెద్ద రోగాలు ఏవన్నా డాక్టర్లు గుర్తిస్తే మెడికల్ కాలేజీలో చికిత్స చేయిస్తానని వారి కోసం ప్రత్యేక అంబులెన్సు ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే వారిపై కుటుంబం ఆధారపడి ఉంటుందని తెలిపారు. దీన్ని గుర్తించి ఆరోగ్యంపై× దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మొదటగా వికారాబాద్ నియోజకవర్గంలో నిర్వహించి సేవలందించ డం చాలా సంతోషకరమని అన్నారు. ప్రజలకు కష్టం వస్తే ముందు ఉంటూ ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని సేవలను అందిస్తున్న ఎంపీ రంజిత్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. గతంలో ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండేవారు కారని ఎప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. నిత్యం అందరికీ అందుబాటులో అతి తక్కువ కాలంలో అందరి మన్ననలు పొందుతూ రాజకీయాలకు అతీతంగా అభిమా నులను సంపాదించుకున్న వ్యక్తి రంజిత్ రెడ్డి అని అన్నారు. మహిళలు రొమ్ము క్యాన్సర్, గర్భసంచి వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారని వారందరూ మొదటి దశలోని రోగాలను గుర్తించాలని డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. అంతకుముదు ఉచిత వైద్య శిబిరానికి వచ్చినటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజునాయక్, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ సంతోష్, పీఏసీఎస్ చైర్మెన్ సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కె. రాజు గుప్త, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ రాములు, వేణుగోపాల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, డాక్టర్ రాహుల్ చాతి జనరల్ నిపుణులు, తేజరెడ్డి, గైనకాలజిస్ట్, పృథ్వీరాజ్, పిల్ల ల వైద్య నిపుణులు, పద్మనాభం, శాస్త్ర చికిత్స నిపుణులు, పంచాయతీ కార్యదర్శి పూర్ణిమ, ఆర్ ఆర్ ఫౌండేషన్ వాలంటీర్లు, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.