Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముదిరాజ్ జిల్లా సంఘం అధ్యక్షులు
భైరమోని మల్లేష్
నవతెలంగాణ-కందుకూరు
రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముదిరాజు లు అభివృద్ధి కావాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు భైరమోని మల్లేష్ అన్నారు. జేఎంఎస్ పౌండేషన్ ద్వారా, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు బూసర మోని అంజయ్య అధ్యక్షతన పదోతరగతి చదువుతున్న ముదిరాజు విద్యార్థులకు మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో పెన్నులు, పెన్సిలు, కంపాస్ బాక్స్‌లు పరీక్ష ప్యాడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని నైపుణ్యం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు ఎన్.మహేందర్, జిల్లా నాయకులు కాకి దశరథ, ప్రసంగం జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ శ్రీధర్, ఎంపీటీసీ కాకి రాములు, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి సురేందర్, మార్కెటింగ్ డైరెక్టర్ పిట్టల పాండు, కార్యవర్గ సభ్యులు వెంకటేష్, అది కిషన్ ముదిరాజ్, రవి, ఎడ్ల ఉదరు, వన్య సురేందర్, మహేందర్, విలన్ నీలం వెంకటేష్, కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.