Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
కాంగ్రెస్ పార్టీకి షాబాద్‌లో పూర్వవైభవం తీసుకువస్తామని టీపీసీసీ కార్యదర్శి మధు సుదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టీపీసీసీ కార్యదర్శి మధుసుదన్‌రెడ్డి, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి భీమ్‌భారత్, పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్ ఆధ్వ ర్యంలో నగరంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీ తీర్థం పుచ్చు కున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సాగిస్తున్న నియంత పాలనకు విసుగు చెందిన, ఆ పార్టీ నాయకులే స్వచ్చందంగా కాం గ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అన్నా రు. షాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి, కంచుకోటగా మారుస్తామన్నారు. పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, రామ చందర్, సిద్దయ్య, భాస్కర్, చెన్నయ్య, అనిల్ కుమార్, రవి, మురళి, మహేందర్‌రెడ్డి, భాస్కర్, ఎండి నయీం, శ్రీరాం, గొల్ల మల్లేష్‌యాదవ్, తిరుపతిరెడ్డి, చిన్నయ్య, చంద్రశేఖర్, కుమార్‌లు ఉన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గౌండ్ల నర్సింలుగౌడ్, చేవెళ్ల స్వామి, ఎన్.అశోక్, శేఖర్, చంద్రారెడ్డి, ఖలీల్‌పాష, రాంచందర్, వింజమూర్ సత్యనారాయణగౌడ్, యాదయ్య శ్రీరాములు, యాదయ్య, గోపాల్, వరప్రసాద్, మల్లేష్, కృష్ణ, వెంకటేష్, తదితరులు ఉన్నారు.