Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాంధీని కోరిన
డివిజన్ వాసులు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం, నానక్ రాంగూడ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై మాజీ కార్పొరేటర్ సాయిబా బా ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయదుర్గం, నానక్ రాంగూడ కాలనీలలో సీసీరోడ్లు, డ్రయినేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు. మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రమేష్, కాలనీ వాసులు అక్బర్, వాజిద్, మన్సూర్, ఖాదర్ ఖాన్, మాక్బూల్, షేక్ అక్బర్, మజీద్, తదితరులు పాల్గొన్నారు.