Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిగ్ బాస్ విజేత విజే సన్నీ
నవతెలంగాణ-షాద్ నగర్
సేవ కార్యక్రమాల్లో యువత ఎల్లప్పుడు ముందుండాలని బిగ్ బాస్-5 విజేత విజే సన్నీ అన్నారు. శనివారం షాద్ నగర్ పట్టణంలో జోగులాంబ ఫంక్షన్ హల్లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమం ద్వారా అభిమానులను కలుసుకున్నారు. ముందుగా షాద్నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి ముఖ్య కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడారు. మనం ఎంత ఎదిగిన, ఎన్ని విజయాలు సాధించిన సమాజంలో ఎదో ఒక సేవ కార్యక్రమాల ద్వారా అందరికీ ఉపయోగ పడే విధంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఎదో ఒక కళ ఉంటుందని, ఎవరికి ఇష్టం ఉన్న రంగంలో రాణించాలంటే కృషి పట్టుదల ఉండాలని సూచించారు. ఎప్పుడు సమాజానికి మంచి చేసే వారిగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి.సంతోష్ కుమార్, సందీప్, జాఫర్, లతోపాటు రాజు నాయక్, అశోక్, శ్రీకృష్ణ, దాసరి శ్రీశైలం, రవికుమార్, శంకర్, జగన్, బిచ్చు నాయక్, మహబూబ్, పవన్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.