Authorization
Fri March 14, 2025 10:07:53 pm
- సిగల్స్ ఏర్పాటు చేయాలి
- మేయర్ మహేందర్ గౌడ్
నవతెలంగాణ-గండిపేట్
బండ్లగూడల్లో పెరు గుతున్న ట్రాఫిక్‌ను (అదుపు) నియంత్రించాలని మేయర్ మహేందర్‌గౌడ్ అన్నారు. సోమ వారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ల్లో పోలీసు ట్రాఫిక్ ఉన్నత అధికారులతో కలిసి ట్రాఫిక్ సమస్యపై విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ట్రాఫిక్ సిగల్స్, పాదచారుల కోసం పుట్ టవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలన్నారు.కార్యక్రమంలో గౌచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ, ఎసీపీ పోలీసులు అధికారులు పాల్గొన్నారు.