Authorization
Thu March 20, 2025 03:58:04 pm
- కూచిపూడి నృత్య ప్రదర్శన
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
మాదాపూర్‌లోని శిల్పారామంలో ఉగాది సందర్భంగా ఆదివా రం యంపీ థియేటర్లో ''ఉగాది నాట్య హేళ'' కూచిపూడి, భరతనాట్యం నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. నారాయణి నాట్యాలయ గురువర్యు లు సంతోష్‌కుమార్ తమంగ్ శిష్యబృందంతో భరతనాట్య నృత్య ప్రదర్శనలో పుష్పాంజలి, అలరిపు, శివస్తుతి, సరస్వతి శబ్దం, శ్రీ రామచంద్ర, హనుమాన్ చాలీసా, శృంగారలహరి, తిల్లాన అంశాలను మౌనిక ఆ, లావణ్య, కృష్ణ ప్రియా, భవ్య, సోమా, అవని, ఉర్విజ, మాన్వి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.