Authorization
Thu March 20, 2025 10:00:46 pm
నవతెలంగాణ-శంషాబాద్
వ్యవసాయ పొలాల్లో దగ్గర బోరు మోటార్ల వైర్లను దొంగిలిస్తున్న ఇద్దరూ నిందితులను అరెస్టు చేసిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ ఏ. శ్రీధర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజులుగా మండల పరిధిలోని బూర్జు గడ్డతండా, మదనపల్లి, ఘంసియా గూడ, సంఘీగూడ గ్రామాలలో వ్యవసాయ భూముల దగ్గర బోర్ మోటార్ తీగలను మంద ప్రసాద్, వసుపుల కృష్ణ ఇద్దరిని దొంగిలిస్తూ ఆందులోని కాపర్ వైర్‌ను తీసి అమ్ముకుంటున్నా రు. వీరిద్దినీ మహేశ్వరం మండల పరిధిలోని గొల్లూర్ గ్రామంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.