Authorization
Thu March 20, 2025 10:00:46 pm
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి నియోజక వర్గంలోని కేస్లి తాండా గ్రామపంచాయతీ పరిధి లోని తుమ్మలకుంట తాండాకు చెందిన రామావత్ సక్రి అనారోగ్యంతో బాధపడు తూ సోమవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న తలకొండపల్లి మం డల జడ్పీటీసీ సభ్యులు ఉప్పల వెంకటేష్ మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సం తాపాన్ని తెలిపారు. తక్షణ సాయంగా తన ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి రూ.3 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మణ్ నాయక్, నాయకులు శంకర్ నాయక్, రేక్యా, భీమ్లా, బాల్య, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.