Authorization
Fri March 21, 2025 02:11:06 am
- ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ ఏక్బల్
నవతెలంగాణ- కోడంగల్
పేదలను ఆదుకోవడం గొప్ప విషయం పవిత్ర రంజాన్ మాసంలో జకాత్లో భాగంగా పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు కోడంగల్ మండలంలోని రుద్రారం, అంగడి రైచూరు, చిట్లపల్లి గ్రామాలలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దామోదర్ రెడ్డితో కలిసి ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ ఏక్బల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ ఏక్బల్ మాట్లాడుతూ..సంపదలో కొంత భాగం పేదలకు సహాయం చేయడం వల్ల సంతృప్తి కలుగుతుందని అన్నారు. స్థితిమంతులు కావడం గొప్పతనం కాదని, సేవ గుణం దాతృత్వాన్ని ఇమిడీకృతంతో పేదలకు చేయూతనిచ్చి ఆదుకోవడంలో నిజమైన ఆనందం, గొప్పతనం దాగి ఉందన్నారు. మహమ్మద్ ప్రవక్త చేసిన శాంతి, ఐక్యతల సందేశం అందరికీ అనుసరణీయం అన్నారు, యుద్ధంలో సైతం నీతిని పాటించిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అని, ఆయన దువా సౌభాగ్యం కలగడాన్ని ఆదమ్ అలై స్సలాం కూడా గర్వించారని అన్నారు. ప్రవక్త శాంతిని కాంక్షించారని, ప్రతి ఒక్కరం ఆయన చూపిన మార్గంలో నడుచుకోవాలని అన్నారు. తన వంతు సహాయంగా పేదలకు నిత్యవసర సరుకులు అందించడానికి ఆస్కారం లభించిందని అన్నారు. పండుగ అంటే పేదలు, ధనికులు అందరూ జరుపుకోవాలని మహమ్మదు ప్రవక్త సూచించారని అన్నారు. కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, మజీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.