Authorization
Thu March 20, 2025 06:22:52 pm
- బీసీ కమిషన్ సభ్యులు ఎన్. శుభప్రద్ పటేల్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకోవాలని బీసీ కమిషన్ సభ్యులు ఎన్. శుభప్రద్ పటేల్ అన్నారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారని అన్నారు. అయన ఆచరించిన కార్యాచరణ, ఆలోచన విధానాలు ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజరు కుమార్, జిల్లా వెనుక బడిన సంక్షేమ శాఖ అధికారి ఉపే ందర్, సహాయ అధి కారి భీంరాజ్, జిల్లా బిసి సంఘం అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు కృష్ణ, సభ్యులు యాదయ్య, మహేందర్ లతో పాటు బిసి వసతి గహ సంక్షేమ అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.