Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి
- జిల్లా కేంద్రంలో మోడీ దిష్టిబొమ్మ దహనం, నిరసన
నవతెలంగాణ-వికారాబాద్ రూరల్
కేంద్రంలోని మోడీ ప్రజావ్యతిరేక విధానాలను త ెలిపేందుకు రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో కార్య క్రమానికి భయపడి మోడీ, రాహుల్ సోనియాలపై ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌తో వేధింపులకు గురిచేస్తున్నారని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ, ప్రదేశ్ కాంగ్రెస్ కమి టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోనియా, రా హుల్ల పై మోడీ ఈడీ వేధింపులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ కార్యకర్తలతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశా రు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలి పేందుకు రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో కార్య క్రమాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీతో వేధింపులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. స్వాతంత్య్రానికి పూర్వం నుండి గాంధీ కుటుంబం దేశానికి ఎనలేని సేవలందిస్తూ వచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. స్వాతం త్రం పోరాటంలో నెహ్రూ కుటుంబం తమ ఆస్తులను ఫణంగా పెట్టి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిందన్నా రు. ఇందిరాగాంధీ ధనిక వర్గాల వద్దనుండి భూములను లాక్కొని నిరుపేదలకు అందించి ఉక్కు మహిళగా పేరు సంపా దించారని నిరుపేదల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఆయన గుర్తు చేశారు. ఇందిరా మరణానంతరం రాజీవ్ గాంధీ ప్రధానిగా యువతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అం దించే దేశాన్ని అభివృద్ధివైపు మళ్లించారన్నారు. రాజీవ్ అనంతరం సోనియాగాంధీ ప్రధాని అయ్యే అవకాశమున్నా పీవీ నరసింహారావును ప్రధానమంత్రిని చేసి త్యాగనిరతిని చాటారాని అన్నారు. ఇటువంటి త్యాగధనుల కుటుంబం పై కక్షగట్టి రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ ద్వారా వేధిం పులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పై ఈడీ కేసులను వెంటనే ఎత్తివేయా లని ఆయన డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయలేని అసమర్ధ ప్రధాని మోడీ బహిరంగంగా దేశ ప్రజలకు క్షమాపణ తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రత్నారెడ్డి, కిషన్‌నాయక్, అనంత రెడ్డి, ఎర్రవల్లి జాఫర్, వికారాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సి లర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయ కులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.