Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు బుస చంద్రయ్య
నవతెలంగాణ-కొడంగల్
ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పరిగి మండలం రాంపూర్ గ్రామంలో పేదలు గుడిసెలు వేసుకుంటే వారికి మద్దతుగా ఉన్న సీపీఐ(ఎం) నాయ కులను అరెస్టు చేయడం అప్రజా స్వామికమనీ సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు బుస చంద్రయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇల్లు లేనటువంటి నిరుపేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వే సుకుంటే ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేసి కొడంగల్ పోలీస్ స్టేషన్కు తరలించడాని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇప్పటికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. ఇల్లు లేక ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే వారిపై లాఠీచార్జీ చేయడం సరైంది కాదన్నారు. పేద ప్రజలపై లాఠీచార్జీ చేసిన నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.