Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలువలతో కూడిన జర్నలిస్టులకు ఎక్కడైనా ప్రాధాన్యత ఉంటుంది
- టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-షాద్నగర్
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని, జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులుగా ఉండాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ అన్నారు. షాద్నగర్ పరిధిలోని ఒక ప్రయివేట్ హౌటల్లో రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ నియోజ కవర్గ అధ్యక్షులు శ్రీశైలం సాక్షి దినపత్రిక అధ్యక్షతన టీయూడబ్ల్యూజే(ఐజేయూ)ఆత్మీయ సమ్మేళనం కార్యక్ర మాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా విలే కర్లను ఉద్దేశించి గుడిపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజంలో ముందటి పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలతో కూడిన జర్నలిస్టులకు ఎక్కడికెళ్లినా ప్రాధాన్యత ఉంటుందని, విలువలతో కూడిన వార్తలను సేకరించాలని అన్నారు. సామాన్య ప్రజలకు వార్తలు చేరే విధంగా ఉండాలని అన్నారు. మున్ముందు మంచి ఫలితాలు వచ్చేలా రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడి యా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా భాను 5, ప్రధాన కార్యదర్శిగా సుధాకర్, ఉపాధ్యక్షులుగా స్టూడియో 18, ఖాజా సోహైల్5, బాలు టీవీ న్యూస్, జాయింట్ సెక్రటరీలుగా సలీమ్(స్టూడియో) శ్రవణ్ గౌడ్ 9న్యూస్, బైరమోని మహేష్ ఆదాబ్ హైదరాబాద్, విష్ణు ప్రచార కార్యదర్శిగా శ్రీహరి రాజు, కోశాధికారిగా రమేష్ 9న్యూస్, సలహాదారులుగా శ్రీనివాస్, నర్సింహా, కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్(24న్యూస్), జగన్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో శరత్ కుమార్ సాక్షి పత్రిక, భాస్కర్ మన తెలంగాణ పత్రిక, రమేష్ ప్రజాపక్షం, రాజశేఖర్ వెలుగు, శ్రీనివాస్ ప్రజాపక్షం, ఇలియాస్ విశాలాంధ్ర, సమీ మనసాక్షి, యాదగిరి వార్త, ధరంపాల్ మనం, జగన్ దర్శినిటుడే పాల్గొన్నారు.