Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్చార్జ్ గజ్జల యోగానంద్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
నియోజకవర్గం పరిధిలోని హైదర్‌నగర్ డివిజన్లోని శ్రీనివాస కాలనీలోని సర్వే నెం బర్-95లోని సుమారు 1000 గజాల ప్రభు త్వ స్థలం కబ్జాకు గురవుతుందని ప్రభుత్వా అధికారులు తక్షణమే స్పందించి ఆ స్థలంలో పిల్లల కోసం చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చే యాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి గజ్జల యోగానంద్ అన్నారు. పార్క్గాని, ఇతర ప్రజా ప్రయో జనాల కోసం ఉపయోగించాలంటూ ఆదివారం చిన్న పిల్లలతో కలిసి కాలనీవాసులు ధర్నాకు ది గారు. వారికి మద్దతుగా గజ్జల యోగానంద్ ధర్నాలో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ ఎస్ ప్రభుత్వంలో కబ్జా రాయుళ్లు విర్రవీగు తున్నారని, ఎక్కడ ఖాళీ స్థలం కనపడినా కబ్జాలకు పాల్పడుతున్నా రని, అసెంబ్లీ పరిధిలోని అనేక ఖాళీ స్థలాల పరిస్థితి ఇలా గెే ఉందని, ప్రభు త్వం వెంటనే అలాంటి స్థలాలను ప్రజ లకు ఉపయోగపడే విధంగా ఫంక్షన్ హాల్స్, పార్క్స్, ఓపెన్ జిమ్స్, స్టేడియం వంటివి నిర్మించాలని డిమాండ్ చేసారు. కాలనీ వాసుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తనవంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు. కార్య క్రమంలో నాయకులు బ్రహ్మయ్య, కోటేశ్వరరావు, లక్ష్మీ అన్నపూర్ణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.