Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాండూరు రూరల్
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో తాండూరు మండలం కో టాబాస్ పల్లి గ్రామానికి చెందిన ఆర్కే సంజీవ అనే వ్యక్తి ఇంటికి షార్ట్ సర్క్యూట్ ద్వారా రూ.50.వేలతోపాటు ఫ్రిడ్జ్, మంచం, బట్టలు ధ్వంసమై లక్షరూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు సంజీవ తెలిపారు. ఈ సంద ర్భంగా బాధితులు మాట్లాడుతూ.. చుట్టాల పెండ్లికి వెళ్లిన సమయంలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెల రేగాయాని పక్కింటి వారు సమాచారం అందించారు. వ చ్చి చూసేసరికి డబ్బులు, బట్టలు, ఫ్రిడ్జ్ మొత్తం కాలి పోయాయని తెలిపారు. ఆర్థికంగా నష్ట పోయినందున ప్రభుత్వం సహాయం చేయాలని బాధితులు వేడుకుం టున్నారు.