Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు అవగాహన కల్పించిన ఏఎస్ఐ సత్తయ్య
నవతెలంగాణ- తాండూరు రూరల్
సైబర్ నేరాలకు గురికాకుండా వచ్చిన ప్రతీ ఫోన్ కాల్‌కు స్పందించిన మీ వివరాలను ఇతరులకు తెల్వ కుండా అప్రమత్తంగా ఉండాలని కరణ్ కోట ఏఎస్ ఐ సత్తయ్య అన్నారు. ఆదివారం తాండూరు మండలం అల్లాపూర్ గేటు సమీపాన అడ్డా కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాటి కంప్యూటర్ యుగంలో అనేకమైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని దానికి గురికాకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బ్యాంకు నుండి ఫోన్ కాల్ చేస్తున్నాం ' మీ ఆధార్ బ్యాంకు అకౌంట్ పర్సనల్ వివరాలను మాకు వివరించండని చెప్పి కూడా మీ ఖాతాలో ఉన్న డబ్బులను దోచుకుంటున్నారని ' అన్నారు. అలాంటి ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే స్పందించకుండా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు బ్యాంకు అధికారులు ఎవరు కూడా ఫోన్లో సమాచారం ఇవ్వాలని అడిగారని అవసరమైతే మీరు బ్యాంక్‌కు వెళ్ళినప్పుడు స్వయంగా వాళ్లే అడవి 'మీ యొక్క ఖాతాకు సంబం ధించిన వివరాలను నమోదు చేస్తారని' అన్నారు దీనిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కార్మికులు ఉన్నారు.