Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
గీత మైన, కథ అయినా, ఇతర సాహితీ ప్రక్రియల్లో తన దైన శైలిలో రచన చేయగల ప్రతిభామూర్తి వడ్డేపల్లి కృష్ణ అని బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళభరణం కృష్ణ మోహన రావు కొనియాడారు శ్రిత్యాగారాయ గాన సభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై కల హంసి ఆర్ట్స్, సత్కళాభారతి ఆధ్యర్యంలో డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించిన మర్యాద రామన్న కథలు సంపుటిని అవిస్కరం సభ జరిగింది. ముఖ్యఅతిథిగా డాక్టర్ కృష్ణ మోహనరావు పాల్గొని సంపటిని అవిస్కరించి మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో కథలకు ప్రత్యేక స్థానం ఉందని బాలసా హిత్యం నేడు అరుదుగా వెలువడుతోందని అన్నారు. కృష్ణ రచించిన మర్యాద రామన్న కథలు నీతి బోధకాలు పిల్లలకు ఆసక్తి కలిగే విధంగా కథనం వుందని అన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించి మాట్లాడుతూ కృష్ణ గీతలు సినారె లలిత గీతాల శైలిలో వుంటాయని వివరించారు. అనంతరం కళా హంస ప్రతిభా పురస్కారాలను సాహితీవేత్త ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్యులుకు, సంగీత స్వరకర్త చిత్తరంజన్ కు, ప్రముఖ అనువాద రచయిత డాక్టర్ ఏం. లక్ష్మణ చార్యు లుకు బహూకరించారు. నేటినిజం సంపాదకుడు బైస దేవదాస్ పురస్కార గ్రహీతలును అభినందించారు. దాసరి వెంటరమణ తదితరులు పాల్గొన్నారు. తొలుత కవి సమ్మేళనంలో మాధవి, లలిత, పీ.వెంకట దాసు, రఘువీర్ ప్రతాప్, పోతురి సుబ్బారావు, వసుంధర స్వీయ కవితలు చదివారు.