Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
నాట్యం ఎంచుకొనే అంశాలను బట్టి నవ రసాలను ప్రదర్శించి ప్రేక్షకులను రంజింప చేసే అవకాశం వుంటుంది. విదేశాల్లో ఉన్నప్ప టికీ తెలుగు సంస్కృతిని మరువక తమ పిల్లల కు తెలుగు సంస్కృతి కళల పట్ల అభిరుచి పెం చే తల్లితండ్రులకు మంచి గురువు లభిస్తే వా రు మంచి కళా కారులుగా ఎదగవచ్చు అనటా నికి నిదర్శనం శాన్వీక కూచి పూడి నాట్య రంగ ప్రవేశం రవీంద్రభారతి ప్రధానవేదికపై అమెరి కాలోని న్యూ జెర్సీ నగరానికి చెందిన సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్ నిర్వాహకురాలు నాట్య గురువు ఇందిరా శ్రీ రామ్ రెడ్డి శిష్యురాలు శాన్వీక కూచి పూడి నృత్య రంగప్రవేశం చేశారు. తొలి అంశంగా కూచి పూడి భాగవతుల సంప్రదాయ కీర్తన సంబాపరకు దేవీ పరాకును నర్తించి అన్నమయ్య కీర్తన ముద్దు గారే యశోద అంశంలో ప్రదర్శించిన కోపం, లాలన, అలకలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టు కున్నాయి. నారాయణ తీర్థ తరంగం నీల మేఘ శరీర నృత్య కళాకారిణికి లయ తప్పక్షుం పాదహస్త ముద్రలు ప్రదర్శిం చ టం కష్టం కాగా శాన్వీక నేర్పుగా నర్తించారు. ఇతర అంశాలు శువాస్తకం భామాకలాపం లను నర్తకి ప్రదర్శించారు. నటవంగం గురువు ఇందిరా శ్రీరామ్ చేయగా మృదు రవళి, శ్రీనివాస్‌లు గత్ర సహకారం అందిం చారు. మృదంగం పై చం ద్రకాంత్, వాయు లీనం పై కృష్ణ స్వరూప్, వేణువు పై దత్తా త్రేయ, వీణ పై రాయప్రోలు సుధాకర్ సహకరించారు.