Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పెంటనోళ్ళ నరసింహ
నవతెలంగాణ-షాద్నగర్
ఎస్సి వర్గీకరణలో బీజేపీ నిర్లక్ష్యం వీడాలని, మాదిగల సహనాన్ని పరీక్షిస్తే బీజేపీకి పుట్టగతు లుండవని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పెంటనోళ్ళ నరసింహ అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్షలు 7వరోజుకు చేరింది. ఆదివారం కొందుర్గు మండల ఎమ్మార్పీఎస్ ఇన్ చార్జి ఆనెగళ్ళ ఆనంద్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షను షాద ్నగర్ ఎంపిడిఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసి మోకాళ్ళ పై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పెంటనోళ్ళ నరసింహ మాట్లా డుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజులలో వర్గీకరణ చేపడతామన్న ఇప్పటివరకు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశా ల్లోనే చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాత్రికి రాత్రే నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభు త్వం, మాదిగలకు ఇచ్చిన మాటను 8 ఏండ్లు గడిచినా ఎందుకు నిలబెట్టుకోవడం లేదనీ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించి మాదిగలకు న్యాయం చేయాలనీ ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కొందుర్గు మండల్ ఇన్చార్జి వెంకటయ్య మాదిగ, కర్రె బన్నీ మాదిగ, కళ్ళపూరం యాదయ్య మాదిగ, జ్యోతి మాదిగ, స్వాతి మాదిగ, గంగోత్రి మాదిగ, రాజేశ్వరి మాదిగ, కీర్తి మాదిగ, అనిత మాదిగ తదితరులు పాల్గొన్నారు.