Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణికొండ
మణికొండ మున్సిపాలిటీలోని హల్కాపురిలో ధన్వి మల్టీ స్పెషల్ క్లినిక్‌ను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేయగా ఆదివారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హల్కాపూరి ప్రజలకు డాక్టర్ శ్రీని వాస్ రెడ్డి అందుబాట్లోకిి క్లినిక్ తీసుకురావడం చాలా మంచి పరిమాణమమని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మణికొండ ము న్సిపల్ కమిషనర్ పాల్గుణ కుమార్, మున్సిపాలిటీ చైర్మన్ కస్తూరి నరేందర్, వైఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ బుద్దోలు శ్రీరాములు, ఫ్లోర్‌లీడర్ రామకృష్ణ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు శంకర్, శివ, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.