Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేరుకే 'మన ఊరు మన బడి'
- గదులో సక్రమంగా లేక విద్యార్థుల ఇబ్బందులు పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-తాండూరు రూరల్
రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 'మన ఊరు మన బడి' కార్యక్రమాన్ని టెం డర్లు వేసి పనులు చేయాలని చెప్పిన స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యంవల్ల పనులు కొనసాగడం లేదు. కొన్ని గ్రామాల్లో పాఠశాలలు, వంట గదులు అ ధ్వానంగా మారి నిత్యం ఇబ్బందులు పడాల్సివస్తోంది. అ లాంటి స్కూళ్లను 'మనఊరు-మనబడి' కింద ఎంపిక చే యకుండా విద్యార్థుల సంఖ్య ప్రకారం ఎంతో కొంత మేర సౌకర్యాలున్న పాఠశాలను ఎన్నిక చేశారు. కానీ ఇబ్బం దుల్లో ఉన్న పాఠశాలను ఎంపిక చేయడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి నిద ర్శనం తాండూరు మండలం చంద్ర వంచ, బిజ్వార్ గ్రా మాల్లో వెలసిన పాఠశాలని చెప్పవచ్చు. ఈ రెండు గ్రామా ల్లో పాఠశాల మొత్తం పర్రెలు వచ్చి ఇబ్బందులు పడుతు న్నారు. అంతేకాకుండా మౌలిక వసతులు లేక విషయం విద్యార్థినీ విద్యార్థులతో పాటు వంట చేసే వారూ ఇబ్బం దులు ఎదుర్కొంటూ కాలం వెల్లదీస్తున్నారు. పాఠశాలను మరమ్మతులు చేయాలంటూ అధికారులకు ప్రజా ప్రతిని ధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. పాఠశాలను కనీసం 'మనఊరు మనబడి' కిందనైనా ఎంపిక చేసి సమ స్యలు లేకుండా చేస్తారేమోనని ఆశించిన ఫలితం లేకుం డా పోయింది. పాఠశాలల్లో సమస్యలు తలెత్తుతున్నాయ ని పలుమార్లు ఉన్నత అధికారులకు, ఉన్నతాధికారులకు తెలిపినా మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న వారు తప్ప క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో మౌలిక వసతుల తులు ఉన్నాయా లేవా అని చూడకుండానే 'మనఊరు - మన బడి' కింద ఎంపిక చేశారని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి గ్రా మంలో పాఠశాలను తనిఖీ చేసి అక్కడున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో వసతులతోపాటు సమ స్యలను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.