Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాట్లాడుతూ ఎం విజయ శ్రావణ్ కుమార్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
బషీర్బాగ్లో ఆదివారం జరిగిన టీఎస్సీపీఎస్ ఈ యు ఉద్యోగోపాధ్యాయ సంఘ సమావేశంలో రాష్ట్ర ఉపా ధ్యక్షులు మొగుడంపల్లి విజయ శ్రావణ్ కుమార్ సీపీఎస్ సమస్య తీవ్రత గురించి మాట్లాడుతూ సంఘ ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ అమలు సౌకర్యం కల్గించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగో పాధ్యా యుల జీవితాల్లో చీకట్లు నింపిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి సత్వరం పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తేవా లని ప్రభుత్వాన్ని కోరారు. టిఎస్సిపిఎస్ ఈయు రాష్ట్ర అధ్యక్షులు జి. స్థిత ప్రజ్ఞ అధ్యక్షత వహించిన కార్యక్రమా నికి కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, రోషన్, మ్యాన్ పవన్, వెంకటేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.