Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్ రూ.15 లక్షల విరాళం అందజేత
నవతెలంగాణ-కొత్తూరు
మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ చౌరస్తాలో దు ర్గామాత ఆలయ నిర్మాణ పనులను ఆదివారం కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ప్రారంభించారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన పూర్తి రూ.15 లక్షల నిధులను కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్ విరాళం గా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించి ఘనంగా సన్మానించారు. చైర్ పర్సన్ మాట్లా డుతూ..ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభి స్తుందన్నారు. పలు సేవా కార్యక్రమాలను తన సొంత నిధు లతో నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ను పలువురు ఆదర్శంగా తీసు కుని పట్టణాభివృద్ధికి ముందుకు రావాలన్నారు. కార్యక్ర మంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, ఎంపీటీసీ చింతకింది రాజేందర్ గౌడ్, నాయకులు బాతుక దేవేందర్ యాదవ్, దుర్గయ్య గౌడ్, దాసు గౌడ్, గణేష్ గౌడ్, మో హన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సత్తయ్య గౌడ్, నాగరాజు గౌడ్, మహేష్ గౌడ్, వినోద్ గౌడ్, అమడా పురం నరసింహ గౌడ్, రేనట్ల రాజేందర్ గౌడ్, భాస్కర్ గౌడ్, కోస్గి యాదయ్య, ప్రమోద్ గౌడ్, ప్రకాష్ గౌడ్, గోవర్ధన్ గుప్తా, పెద్దాపురం శ్రీనివాస్ గౌడ్, హరీష్ గౌడ్, సాయి గౌడ్, సునీల్ శర్మ, నరసింహారెడ్డి, శ్రీధర్, మాధవరెడ్డి, కమలమ్మ, జ్యోతి, స్వరూప, అరుణ, విజయ, లలిత, ప్రసన్న, కవిత, రణధీర్, సచిన్ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.