Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నాయకులు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్లోని స్టాలిన్ నగర్లో బీజేపీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆదివారం పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కాలనీలో ఎక్కడ చూసినా తవ్వి వదిలేసిన రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రయినేజీలు దర్శనమిస్తు న్నాయని అన్నారు. మంచినీటి ఎద్దడి ఉందన్నారు. గతంలో భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో నీటి ఎద్దడి ఉందని గమనించి ఈ కాలనీలో బోర్లు వేశారని ఇప్పుడు అవి పాడైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వారు అన్నారు. ప్రస్తుత సమస్యలన్నీ అధికారుల దృష్టికి తాము తీసుకెళ్తామని అధికారులు స్పందించిన ఎడల తమ సొంత నిధులతో ఈ బోర్లను మరమ్మతు చేపిస్తామని వారు తెలిపారు. కాలనీలో పోచమ్మ, ఎల్లమ్మ గుళ్లు ఉన్నాయి కానీ గుడికి చుట్టూ ప్రహరీ లేకపోవడంతో కొంతమంది యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అతిత్వరలో ఆలయ అభివృద్ధికి తమ సహాయం ఉంటుందని అన్నారు. కార్య క్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు నాగులు గౌడ్, కంటెస్టెంట్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు, మాణిక్ రావు, వినోద్ యాదవ్, గుండె గణేష్ ముదిరాజ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, రామకృష్ణారెడ్డి, బాబు, శివరాజ్, ముఖేష్ వెంకటేష్, రాము, శీను, అజరు, అభిషేక్, వెంకట్, గురు, సతీష్ పాల్గొన్నారు.