Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవా దక్పథంతో వైద్యం అందించాలి
- ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ- శంషాబాద్
అధునాతన వసతులతో శంషాబాద్‌లో ఏర్పాటు చేస ిన 100 పడకల సన్రైస్ ఆస్పత్రిని చేవెళ్ల పార్లమెంట్ స భ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకా ష్ గౌడ్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. అత్యాధు నిక వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన సన్ రైస్ ఆస్పత్రిని శంషాబాద్‌లో ఏర్పాటు చేయడం పట్ల యాజ మాన్యాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం సేవా దక్పథంతో అందించాలని లాభాపేక్షతో నడ పరాదని అన్నారు. శంషాబాద్ పట్టణంలో నూతన సాం కేతిక పరిజ్ఞానంతో సన్రైస్ ఆస్పత్రి ఏర్పాటు కావడం సంతోషకరమైన విషయం అన్నారు. పేదలకు కూడా మెరుగైన వైద్య సహాయం అందించే విధంగా ఆస్పత్రి యాజమాన్యం చొరవ చూపా లన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ రోగులకు అందు బాటులో ఈ ఆస్పత్రి ఉండడం ఎంతో గొప్ప విషయం అన్నారు. వైద్య సాం కేతిక పరిజ్ఞానంతో కూడిన ఆస్పత్రిని ఇక్కడ ఏర్పాటు చేయ డం శుభ పరిణామం అన్నారు. ఇప్పటివరకు రోగులకు ఏదైనా సీరియస్ సిబ్బంది ఉంటే హైదరాబాద్‌లాంటి మ హానగరాలకు వెళ్లేవారని కానీ సన్రైస్ ఆస్పత్రి శంషాబాద్ పట్టణంలోని మధురనగర్‌లో ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, స్థానిక కౌన్సిలర్ స్రవంతి శ్రీకాంత్ రెడ్డి, శంషాబాద్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రారెడ్డి, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పిటిసి తన్వి రాజు, నార్సింగ్ మార్కెట్ కమిటీ చెర్మన్ వెంకటేష్, సీనియర్ నాయకులు గణేష్ గుప్తా, ఎస్. వేణుమాధవ్ రెడ్డి పాల్గొన్నారు.