Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్య
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తెలుగు కవులు ఏనాడూ తామ నివసిస్తున్న సమా జాన్ని దాని ప్రభావాన్ని విడిచిపెట్టి తమ రచనలను చేయ లేదని అయితే అవి ఆయా సామాజిక వర్గాల నుండి వచ్చిన వారి స్వీయ అనుభవాల నుండి ఆ రచనలు వెలువడ్డాయని హైదరాబాద్ విశ్వవిద్యాయం తెలుగుశాఖ అధ్యక్షులు ఆచా ర్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా మాచర్లలోని ఎస్కేబిఆర్ కళాశాల వారు తెలుగు సాహి త్యం సామా కత అనే అంశంపై 2 రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల సదస్సు ముగింపు సమావేశంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని సమాపనోత్సవ ప్రసంగాన్ని చేశారు. ముగింపు సమావేశా నికి సదస్సు సంచాలకులు డా.గుంటుపల్లిగౌరి అధ్యక్షత వహించారు. ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు మాట్లాడు తూ నూతన విద్యావిధానం అమలు చేస్తున్న ఆధునిక దేశ నిర్మాణంలో మల్టిడిసిప్లినరీ విధానంలో తెలుగు సాహిత్యం సమాజానికీ మార్గనిర్దేశం చేసేలా ఉందని ప్రశంసించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాజె లక్ష్మీకుమారి, మద్రా సు విశ్వవిద్యాలయం శంకర్రావు, మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం జెవి రమణ, తానా మాజీ అధ్యక్షులు డా.తోటకూర ప్రసాద్, ఇంగువ మాధవి, డిల్లీ విశ్వ విద్యాలయం నుండి డా.గంపా వెంకట్రామయ్య, యాం శారద, డా.బెజవాడ సుబ్బారావు, హిందీ అధ్యాపకులు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.