Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బషీరాబాద్
బషీరాబాద్ మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ అధ్య క్షతన సోమవారం మండల సర్వసభ్య వాడివేడిగా జరిగింది. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులపై సర్పంచులు మండిపడ్డారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ ఏఈపై సర్పంచ్లు భీమప్ప, కిష్టప్ప, సునీత సేవ్య నాయక్, శివ నాయక్ తదితర గ్రామాల సర్పంచులు భగ్గుమన్నారు. గ్రామాల్లోని స్కూల్లో ఇనుప స్తంభా లు ఉన్నాయని వాపోయారు. విద్యుత్ శాఖ ఏఈ గ్రామాల్లో పర్యటన చేయడం లేదన్నారు. ఫోన్ చేసిన ఎత్తడం లేదన్నారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. కేవలం సమావేశానికి మాత్రమే వస్తున్నారని మండిపడ్డారు. ఏఈని వెంటనే మార్చా లని డిమాండ్ చేశారు. వెంబడే జడ్పీటీసీ శ్రీనివాస్ రడ్డి,ఎ ంపీపీ కరుణ అజరు ప్రసాద్, ఎంపీడీవో రమేష్, స్పందించి విద్యుత్ శాఖ డీఈకి ఫోన్ చేసి విద్యుత్ శాఖ ఏఈని మార్చాలని సూచించారు. సమస్యలు పరిష్కారిస్తామని డీఈ హామీ ఇవ్వడంతో సర్పంచ్లులు శాంతించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కరుణ అజరుప్రసాద్ మాట్లాడుతూ వచ్చే సమావేశం కల్లా విద్యుత్ శాఖ ఏఈని మారుద్దామని సర్పంచు లకు హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో అధికా రులు పర్యటన చేసినప్పుడు సర్పంచులకు, ఎంపీటీ సీలకు పూర్తి సమాచారాలు అందజేయాలని అధికారు లకు సూచించారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కారిం చి, అభివృద్ధి చేయాలని సర్పంచ్లకు సూ చించారు. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పరిశుభ్రతపై ప్ర జలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశం లో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎంపీడీవో రమేష్, వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ లు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.