Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షంలో తడుస్తూనే కొనసాగిన 'బస్తీబాట' కార్యక్రమం
- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
మున్సిపాలిటీ అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని షాద్‌నగర్ ఎమ్మె ల్యే అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం ఆయన 'బస్తీ బాట' కార్యక్రమంలో భాగంగా కొత్తూరు మున్సిపాలిటీ పరి ధిలోని 1,2,3,12వ వార్డులలో పర్యటించి నేరుగా ప్రజ లతో మామేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావ ణ్య దేవేందర్ యాదవ్‌తో కలిసి అక్కివేని గూడా, కుమ్మరి గూడా, స్టేషన్ తిమ్మాపూర్, తిమ్మాపూర్, తిమ్మాపూర్ చౌర స్తాలలో పర్యటించారు. 'బస్తిబాట' కార్యక్రమం కొనసాగు తుండగా భారీవర్షం రావడంతో ఆయన వర్షంలో తడుస్తూ నే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులో ప్రధానంగా విద్యుత్ స్తంభాలు, సీసీరోడ్డు, అండర్ డ్రయినేజ్ సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువ చ్చారు. అక్కివేని గూడాలో ఇండ్ల మంజూరు, బస్సు సౌక ర్యం కల్పించాలని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసు కొచ్చారు. తిమ్మాపూర్‌లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. పిల్లల తో ఎక్కాలు చదివించి బాగా చదువుకోవాలని సూచించా రు. ఆయన మాట్లాడుతూ...మున్సిపాలిటీలో సమస్యలన్ని టిని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణాభి వృద్ధికి ప్రభుత్వం నుండి అధికంగా నిధులు మంజూరు చేయించి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. కార్యక్ర మంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటా గణేష్, వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కోస్గి శ్రీనివాస్, పీర్లగూడెం మా ధవి గోపాల్ గౌడ్, చింతకింది చంద్రకళ రాజేందర్ గౌడ్, తిమ్మాపూర్ ఎంపీటీసీ చింతకింది రాజేందర్ గౌడ్, నాయ కులు బాతుక దేవేందర్ యాదవ్, కొత్తూరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలు రమాదేవి, బ్యాగరి యాదయ్య, మాధవరెడ్డి, భాస్కర్, కర్రోళ్ల లక్ష్మయ్య, మహే ష్‌గౌడ్, కోస్గి యాదయ్య, శంకరయ్య గౌడ్, ఆనంద్ గౌడ్, శ్రీశైలం, భిక్షపతి, నరసింహారెడ్డి, సత్యనారాయణ, రాజు, ఖలేద్, నాగరాజు, ప్రమోద్, ప్రకాష్, గోపి పాల్గొన్నారు.