Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్
- పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఆమనగల్
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద ్దపీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ అన్నారు. సోమవారం మండలంలోని మంగళపల్లి, చింతలపల్లి గ్రామాల్లో శ్మశానవాటికలను ప్రారం భించి, మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన చేశారు. మంగళపల్లి గ్రామం లో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యునిటీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆమనగల్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయ కులు గోలి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్యనాయక్, ఎంపీపీ నేనావత్ అనితా విజరు కుమార్, డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, ఆమనగల్ మార్కెట్ కమి టీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, సర్పంచ్‌లు కొప్పు మంజుల యాదయ్య, తిప్పిరెడ్డి నర్సింహ రెడ్డి, ఎంపీటీసీ సరిత పంతునాయక్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షు డు నిట్ట నారాయణ, నాయకులు పొనుగోటి అర్జున్ రావు, నేనావత్ పత్య నాయ క్, గండికోట శంకర్, సయ్యద్ ఖలీల్, గుత్తి బాల స్వామి, అప్పం శ్రీను, రూపం వెంకట్ రెడ్డి, చుక్క నిరంజన్ గౌడ్, పూసల భాస్కర్, యాదయ్య పాల్గొన్నారు.