Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తృటిలో తప్పన ప్రమాదం
నవతెలంగాణ-దోమ
ఓ వ్యక్తి మద్యం మత్తులో గ్యాస్ సిలిండర్లు తీసుకు వస్తున్న వాహనంతో విద్యుత్ స్తంభాన్ని ఢకొీట్టాడు.ఈ ఘటన దోమ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని శ్రీ దత్తసాయి హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీకి చెందిన బులెరో వాహనం గొడౌన్ నుండి సీలిండర్లు వేసుకుని గ్రామాలకు సరఫరా చేసేందుకు వెళ్లింది. గ్యాస్ సీలిండర్లు గ్రామాల్లో సరఫరా చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా బులెరో వాహనం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో దోమ గ్రామంలోని ఓ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢకొీట్టాడు. దీంతో విద్యుత్ స్తంభం అక్కడికక్కడే విద్యుత్ స్తంభం విరిగి పడింది. విద్యుత్ స్తంభం విరిగిపడిన సమయంలో విద్యుత్ వైర్లకు విద్యుత్ ఉన్నప్పటికీి గ్రామస్తులకు, అటుగా వెళ్తున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. గమ నించి స్థానికులు వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు సమా చారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపి వేసి మరమ్మ తులకు చర్యలు చేపట్టారు. మద్యంలో మత్తులో ఉండి బులె రో వాహనం నడపడంతోనే ఈ ఘటన జరిగిందని స్థాని కులు చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవా లని స్థానికులు వాపోతున్నారు. అతనిపై విద్యుత్ అధికా రులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. వెంటనే ఉన్నతాధికారులు స్తంభాన్ని ఢకొీట్టిన వ్యక్తిపై చర్య లు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయం పై విద్యుత్ ఏఈ కిషోర్‌ను వివరణ కోరగా మద్యం మత్తు లో విద్యుత్ స్తంభాన్ని ఢకొీట్టిన విషయం వాస్తవమే కానీ, విద్యుత్ స్తంబం మరమ్మతులకు సంబంధించి ఖర్చులు గ్యా స్ నిర్వాహకులు తామే భరిస్తానని తెలుపడంతో ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఏఈ తెలిపారు.