Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
ఎలాంటి వే బిల్లు లేకుండా కర్నాటక రాష్ట్రం యాదగిరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని ఎస్సై రవి గౌడ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. సోమవారం ఉదయం పెట్రో లింగ్ చేస్తున్న సమయంలో కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా నుంచి తాండూర్ వైపు వెళ్తున్న లారీని ఎస్సై రవి గౌడ్ పరిశీలించారు. వే బిల్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. సీజ్ చేసి తహసీల్దార్ బుచ్చయ్యకు అప్పచెప్పినట్టు ఎస్ఐ తెలిపారు.